Pages

Subscribe:

Sunday, July 8, 2007

ఆనందాలు

వేకువ వెలుగు చిలిపి స్పర్శకు
కరిగిన తుషార బిందువులు...

విను వీధిలో చుక్కల నడుమ
సందడి చేసే నిండు చంద్రుడు...

కడలిని కౌగిలిడ బిర బిర పారే
అలుపెరుగని నది ఉరుకులు...

ప్రభాతమున పక్షులకిలకిలలలో
ప్రసరించి పలుకరించే దినకరుడు...

ఆమని రాకను ఆర్భాటముగా
తెలిపే కోయిల కమ్మని పలుకులు...

నా మదిని ఉల్లసింపజేసే
అందమైన ఆనందాలెన్నో!

Saturday, July 7, 2007

ప్రేమా?

కనురెప్పల ఎడబాటుకు,
గుండె గుడిలో అలజడికి
కారణమేమిటోనని కలతచెందకు
నిను చూసిన మరుక్షణం
నాదీ ఇదే వైనం!

వెన్నెల

నెలరాజు నా వంక
నీలి మబ్బుల చాటునుండి
నక్కి నక్కి చూడంగ
మినుకు మినుకు చుక్కలల్లే
సిగ్గులొలకగ ఎరుపెక్కిన చెక్కిలి
చెప్పకనే చెప్పింది
నిశినేలే శశికాంతుడు
వెన్నెల ముద్దులిడినాడని!