Pages

Subscribe:

Sunday, July 8, 2007

ఆనందాలు

వేకువ వెలుగు చిలిపి స్పర్శకు
కరిగిన తుషార బిందువులు...

విను వీధిలో చుక్కల నడుమ
సందడి చేసే నిండు చంద్రుడు...

కడలిని కౌగిలిడ బిర బిర పారే
అలుపెరుగని నది ఉరుకులు...

ప్రభాతమున పక్షులకిలకిలలలో
ప్రసరించి పలుకరించే దినకరుడు...

ఆమని రాకను ఆర్భాటముగా
తెలిపే కోయిల కమ్మని పలుకులు...

నా మదిని ఉల్లసింపజేసే
అందమైన ఆనందాలెన్నో!

4 comments:

రాధిక said...

అవే ఆనందాలు నాకూ ఆహ్లాదాన్నిస్తాయి.మీ రాతలు కూడా అందం గా ఆహ్లాదం గా అనిపిస్తున్నాయి.

కిరణ్మయి said...

@రాధిక గారు,ఈ ఊపిరిసలపలేని జీవితంలో అన్నీ టెన్షన్స్ మరిచి మనశ్శాంతినిచ్చేవి ప్రకృతిలోని చిన్న చిన్న విషయాలే! కాని చాలా మంది వాటిని గమనించక ఎంతో కోల్పోతారు.నిజంగా ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక అదృష్టం!థాంక్స్ అండి.

sharma said...

kiranmayi gaaru mi kavithalu chaala baagunnaayandi.. nijaniki mi blog choose mundu naa mood antha baagaledu, kaani mi kavithalu redoo chadivaaka manishini system mundu unnaa.. manasu maathram ekkado viharinchi thaelikapadindi.. manchi bhaavanalu
very good!!

ravindrakumar said...

Chala baga vrasharu thankyou