Pages

Subscribe:

Saturday, July 7, 2007

వెన్నెల

నెలరాజు నా వంక
నీలి మబ్బుల చాటునుండి
నక్కి నక్కి చూడంగ
మినుకు మినుకు చుక్కలల్లే
సిగ్గులొలకగ ఎరుపెక్కిన చెక్కిలి
చెప్పకనే చెప్పింది
నిశినేలే శశికాంతుడు
వెన్నెల ముద్దులిడినాడని!

8 comments:

రాధిక said...

చాలా బాగా రాసారండి.ఈ ఒక్క కవిత చెప్పకనే చెప్పింది మీరు మంచి భావ కవి అని.ఇలాంటిదే నేనొకటి రాసాను
"చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం
గుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
వెచ్చని తలపులు కప్పుకున్న హృదయం
చెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది"

దీనికన్నా మీరు రాసిన ఈ కవిత 100 రెట్లు అద్భుతం గా వుంది.మీ కవితలు మరిన్ని చదవాలని వుంది.త్వరగా పోస్ట్ చేయండి.

జాన్‌హైడ్ కనుమూరి said...

చక్కని బావన
చక్కని వ్యక్తీకరణ
అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి

Viswanadh. BK said...

good one'

ఏకాంతపు దిలీప్ said...

Bhavukatha nindina kavitha... chakkaga vundi.. meeru inka post cheyyandi...

ఏకాంతపు దిలీప్ said...

Bhavukatha nindina kavitha... chakkaga vundi.. meeru inka post cheyyandi...

కిరణ్మయి said...

@రాధిక గారు! ఎంత బాగా వ్రాసారండీ!
"చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం"
నేనేదో పిచ్చి వ్రాతలు వ్రాస్తుంటాను.నాకు నచ్చినవారి(కాబోయే శ్రీవారు) ప్రోత్సాహంతో ఇలా బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టాను
మీ అభినందనలకు చాలా థాంక్స్!

@జాన్ హైడ్ గారికి నమస్సుమాంజలి! మీరు నా బ్లాగు చూడడమే గొప్ప! ఇంక పొగిడితే ఆ ఆనందమే వేరు! కృతజ్ఞురాలిని!

@విశ్వనాథ్ గారు, థ్యాంక్యూ!

@దీపు గారూ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.ఇంక తప్పక వ్రాస్తాను, మునుపు వ్రాసినవి చాలానే ఉన్నాయి. అవన్నీ బ్లాగులో పెడతాను, ఇంక భరించాల్సిందే :)

Unknown said...

ఇంకెందుకాలస్యం...బయటకు తీయండి మిగిలిన అస్త్రాలు కూడా :-)

కిన్నెరసాని కవితా ప్రసాద్ said...

చాలా బాగా వ్రాస్తున్నారు. అభినందనలు.. తరచు పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించండి...